BREAKING
thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● రావులపాలెం జడ్పీటీసీ అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Date of Publish : 22 October 2026, 08:13 am
Posted by : NAGARAJU GADE

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా దుప్పులపూడి శ్రీనివాసరావు?

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
22 Oct, 2026 - 08:13 AM
18 వీక్షణలు

కీలక పదవి అప్పగించనున్నట్లు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సమాచారం ఇచ్చారని వెల్లడి

గతంలో పీఏసీఎస్‌ చైర్మన్‌గా, గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం

రాజాం, శ్రీకాకుళం జిల్లా | ఎన్ టుడే న్యూస్: పనిచేసే నాయకులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చే వ్యక్తిగా పేరున్న రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజాం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు దుప్పులపూడి శ్రీనివాసరావుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవి అప్పగించనున్నట్లు ఎమ్మెల్యే తనకు సమాచారం ఇచ్చారని శ్రీనివాసరావు వెల్లడించారు.

రాజాం మండలం మారేడుబాక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్‌కు ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయానికి కీలకంగా పనిచేశారని, మండల రాజకీయాల్లో వ్యూహకర్తగా గుర్తింపు పొందారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

గతంలో పీఏసీఎస్‌ చైర్మన్‌గా సేవలు

శ్రీనివాసరావు గతంలో మండలంలోని బొద్దాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా పనిచేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా మారేడుబాక గ్రామ సర్పంచ్‌లుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయనకు స్థానిక సంస్థలు, సహకార రంగం, రాజకీయ వ్యవహారాలపై అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా అవకాశం కోల్పోయిన నేపథ్యంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాసరావు

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం అందించిన ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్‌కు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఆయన నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.