దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్న జగన్?
ఆంధ్రప్రదేశ్
విజయవాడ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నట్లు సమాచారం. ఎంపీలు మిథున్రెడ్డి, గురుమూర్తితో పాటు రాష్ట్రంలోని పలువురు వైఎస్సార్సీపీ నేతలపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడులపై ఫిర్యాదు చేసేందుకు ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. రాయచోటిలో పార్టీ కార్యాలయానికి నిప్పంటించిన ఘటన, పులివెందులలో కాల్పుల ఘటన, పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే గవర్నర్తో భేటీ ఖరారైందా అనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.