BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 16 October 2026, 02:13 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు మోసం..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
16 Oct, 2026 - 02:13 PM
11 వీక్షణలు

బెదిరించి రూ.1.10 లక్షల వసూలు

మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో పరిచయం

రైల్వే ఇంజినీర్‌నంటూ నమ్మించి మోసం

నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఉప్పల్ పోలీసులు

హైదరాబాద్: పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసి, బెదిరింపులకు పాల్పడి రూ.1.10 లక్షలు వసూలు చేసిన వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధి చిలుకానగర్‌లో వెలుగుచూసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పుల్లగూర సూర్యనారాయణ (33) అనే వ్యక్తి ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు. తాను రైల్వే ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఆ ప్రొఫైల్‌ను చూసిన గుంటూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్ అతడిని సంప్రదించింది.

ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న సూర్యనారాయణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఈ విషయాన్ని సాకుగా చూపుతూ ఆమెను బెదిరించి రూ.1.10 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు

తాను మోసపోయినట్లు గుర్తించిన మహిళా కానిస్టేబుల్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి సూర్యనారాయణను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.