హైదరాబాద్ బోరబండలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
- హైదరాబాద్‌లో విషాదం..విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి!
- స్టీల్ మగ్‌తో బకెట్‌లో నీళ్లు తీస్తుండగా ప్రమాదం..
- ఏడాది వయసున్న కుమారుడికి తల్లిని దూరం చేసిన ఘటన
హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్టీల్ మగ్‌తో బకెట్‌లో నీళ్లు తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఆయేషా సిద్దిఖ (26) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
సమాచారం ప్రకారం.. ఆయేషా సిద్దిఖ తన భర్త అబ్దుల్ రవూఫ్‌తో కలిసి బోరబండ పరిధిలోని భరత్‌నగర్‌లో ఉస్మాన్ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయట ఉన్నట్లు తెలిసింది. నీళ్లు తీస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో ఆమె మృతి చెందినట్లు సమాచారం
ఆయేషా సిద్దిఖకు రెండేళ్ల క్రితమే వివాహం కాగా, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.