BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 January 2026, 08:42 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిట్యాల మున్సిపాలిటీలో మహిళలకు పెద్దపీట

తెలంగాణ
17 Jan, 2026 - 08:42 AM
369 వీక్షణలు

చిట్యాల మున్సిపాలిటీలో మహిళలకు పెద్దపీట

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు NTODAY NEWS: చిట్యాల రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివారం చిట్యాల మున్సిపల్ కార్యాలయ అధికారులు 12 వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. ప్రస్తుతం విడుదలైన రిజర్వేషన్ల ప్రకారం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వార్డుల వారీగా రిజర్వేషన్లు: 1వ వార్డు: ఎస్సీ 2వ వార్డు: బీసీ మహిళ 3వ వార్డు: ఎస్సీ మహిళ 4వ వార్డు: ఎస్టీ జనరల్ 5వ వార్డు: జనరల్ మహిళ 6వ వార్డు: బీసీ 7వ వార్డు: జనరల్ మహిళ 8వ వార్డు: జనరల్ 9వ వార్డు: జనరల్ 10వ వార్డు: బీసీ 11వ వార్డు: జనరల్ మహిళ 12వ వార్డు: జనరల్ మహిళ చిట్యాల రాజకీయాల్లో సందడి రిజర్వేషన్ల ప్రకటనతో చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొత్తం వార్డుల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ కావడంతో ఆశావహుల మధ్య చర్చలు, లాబీయింగ్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మహిళలకు అధిక సంఖ్యలో వార్డులు కేటాయించడంతో కొత్త నాయకులు రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం ఏర్పడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా మారింది. నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా రాజకీయ సమీకరణలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. #Chityala #MunicipalElections #WomenReservation #LocalBodyElections #PoliticalBuzz #TelanganaPolitics #WomenLeadership Follow us on Website Facebook Instagram YouTube