పూల పండుగలో మహిళల సందడి.. ఘనంగా బతుకమ్మ వేడుకలు
NTODAY NEWS : చిట్యాల
మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రావుల లక్ష్మి వెంకన్న ఆధ్వర్యంలో భారీ బతుకమ్మను వివిధ రకాల పూలతో అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆగు అశోక్ యాదవ్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ వేడుక ఈ సందర్భంగా కౌన్సిలర్ షబానా అజీముద్దీన్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. మహిళలంతా ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
వెంకటేశ్వర కాలనీకి చెందిన మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.