వరంగల్ UGD ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
డీపీఆర్, టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి
మెరుగైన మురుగునీటి నిర్వహణ, పారిశుధ్య సదుపాయాలే లక్ష్యం
వరంగల్: నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ (UGD) ప్రాజెక్టు పురోగతిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, CDMA డాక్టర్ టి.కె. శ్రీదేవి, కేఎఫ్డబ్ల్యూ ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా UGD ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR), టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నగరంలో మురుగునీటి నిర్వహణను మెరుగుపరచడంతోపాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ప్రాజెక్టు పురోగతిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.