రామప్ప వైభవాన్ని చాటేందుకు వరల్డ్ హెరిటేజ్ వాలంటరీ క్యాంప్
ఎన్ టుడే న్యూస్ | తెలంగాణ: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ వైభవాన్ని మరింతగా చాటేందుకు నేటి నుంచి నవంబర్ 3 వరకు వరల్డ్ హెరిటేజ్ వాలంటరీ క్యాంప్ నిర్వహించనున్నట్లు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తెలిపింది.
టెంపుల్ టూరిజంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ శిబిరంలో దేశ, విదేశాల నుంచి 35 మంది వాలంటీర్లు పాల్గొననున్నారు.
రామప్ప ఆలయం, కాకతీయుల కాలం నాటి కట్టడాలపై నిష్ణాతులైన ప్రొఫెసర్లు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వారసత్వ కట్టడాల పరిరక్షణ, చారిత్రక ప్రాధాన్యం, ఆలయ పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
వారసత్వ పరిరక్షణపై అవగాహన
రామప్ప ఆలయ విశిష్టతను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడంతో పాటు, వారసత్వ కట్టడాల పరిరక్షణలో యువత, పర్యాటకుల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.