BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యువతకు డ్రైవింగ్ లైసెన్సులు.. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 04:18 PM
79 వీక్షణలు

యువతకు డ్రైవింగ్ లైసెన్సులు.. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

చింతలపూడి: చింతలపూడి నియోజకవర్గ యువతకు ఎలాంటి దళారీల ప్రమేయం లేకుండా నేరుగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు.

బుధవారం నూజివీడు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణవేణితో సమావేశమైన ఎమ్మెల్యే, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులు డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించడం, డ్రైవింగ్ లైసెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడం, అర్హులైన వారికి లర్నర్స్ లైసెన్స్ (ఎల్‌ఎల్‌ఆర్) జారీ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే మండలాల వారీగా అర్హులైన యువతీ యువకుల జాబితాలను సిద్ధం చేయాలని మండల విద్యాశాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు పారదర్శకంగా, సులభంగా డ్రైవింగ్ లైసెన్సులు అందే అవకాశం కలుగనుంది.