మార్టూరులో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
ఆంధ్రప్రదేశ్
/
బాపట్ల
స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులను సిద్ధం చేసే దిశగా చర్చలు
మార్టూరు (ఎన్ టుడే న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులను ఎన్నికలకు సిద్ధం చేసే దిశగా పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్టూరులో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నాయకులు ఎన్నికల్లో ఎలా పాల్గొనాలి, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు ఎలా సాగాలి అనే అంశాలపై చర్చించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.