BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 17 October 2026, 01:40 pm
Posted by : SEETHA KIRAN KUMAR

యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి: వరంగల్ సీపీ శ్వేత

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
17 Oct, 2026 - 01:40 PM
5 వీక్షణలు

రక్త నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రాణదానానికి ముందుకు రావాలని పిలుపు

వరంగల్: రక్త నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత విజ్ఞప్తి చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

తలసేమియా బాధితులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు రక్తం ఎంతో అవసరమని తెలిపారు. అత్యవసర సమయాల్లో సరైన సమయంలో రక్తం అందితే విలువైన ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్‌ డే సందర్భంగా పోలీసులు నిర్వహించే రక్తదాన శిబిరాల్లో యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొనాలని సీపీ శ్వేత కోరారు. రక్తదానంపై అపోహలు వీడి, అర్హులైన వారు ముందుకు రావాలని సూచించారు.

రక్తదానం సమాజం పట్ల బాధ్యతను చాటే గొప్ప సేవ అని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి అవసరమైన వారికి అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.