యువత మత్తును వీడి క్రీడల్లో రాణించాలి: రేణికుంట్ల ప్రవీణ్
చిత్తాపూర్ సీపీఎల్ క్రికెట్ ఫైనల్స్ విజేతలకు బహుమతుల ప్రదానం
క్రీడా మైదానం ఆధునికీకరణకు కృషి చేస్తానని బీఆర్ఎస్ నేత హామీ
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలో నిర్వహించిన 'చిత్తాపూర్ ప్రీమియం లీగ్ (CPL) సీజన్-2' క్రికెట్ ఫైనల్ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రేణికుంట్ల ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సాధారణమని, ఓటమే గెలుపుకు నాంది కావాలని అన్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు, గంజాయికి బానిస కాకుండా క్రీడల్లో విశేషంగా రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. యువతను తప్పుదోవ పట్టకుండా ఇలాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న చిత్తాపూర్ యువకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ముందుముందు ఇంకా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో చిత్తాపూర్ లోని క్రీడా మైదానాన్ని మరింత ఆధునికీకరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చిత్తాపూర్ సర్పంచ్ కమల మల్లేష్, నెన్నెల సర్పంచ్ ఇబ్రహీం, చిత్తాపూర్ ఉపసర్పంచ్ వెంకటేష్, నెన్నెల మాజీ సర్పంచ్ శ్రీను, డాక్టర్ తిరుమలేష్, సీపీఎల్ నిర్వాహకులు మహేందర్, రమేష్, మల్లేష్ లతో పాటు క్రీడాకారులు, గ్రామ యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు