BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో తొలి రోజు 7 నామినేషన్లు thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● రొంపిచర్ల మండలంలో తొలి రోజు 7 నామినేషన్లు thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Date of Publish : 21 October 2026, 11:31 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నామినేషన్ పత్రాలు చించివేశారంటూ వైసీపీ అభ్యర్థి ఆరోపణ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
21 Oct, 2026 - 11:31 PM
13 వీక్షణలు

పెదరాజుపాలెంలో ఘటన.. టీడీపీ నాయకులపై దివ్యభారతి ఫిర్యాదు తరహా ఆరోపణలు

పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటూ విమర్శ

సీఎస్‌పురం, కనిగిరి నియోజకవర్గం | ఎన్ టుడే న్యూస్: ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జొన్నకోతల దివ్యభారతి నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు లాక్కొని చించివేశారని ఆరోపించారు.

బుధవారం ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసేందుకు మండల కార్యాలయానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆమె మీడియాకు వెల్లడించారు. తన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు బలవంతంగా లాక్కొని చించివేశారని తెలిపారు.

పోలీసుల తీరుపై విమర్శలు

టీడీపీ నాయకులు తనపై దాడికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారని దివ్యభారతి విమర్శించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.

ఈ ఘటనపై పోలీసుల అధికారిక స్పందన, టీడీపీ నాయకుల వివరణ తెలియాల్సి ఉంది. ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.