చిన్నంపేటలో టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు
చిన్నంపేట టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా కొమ్ము సృజన రావు, సర్పంచ్ టీడీపీ అభ్యర్థిగా చిత్తూరు సంజీవరావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. నూజివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మండల న్యాయ విభాగం అధ్యక్షుడు అత్తులూరి శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకుడు రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కందుకూరి అప్పారావు సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలాల్లో, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక శ్రద్ధతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నంపేట ఎంపీటీసీ అభ్యర్థిగా కొమ్ము సృజనరావును, సర్పంచ్ అభ్యర్థిగా చిత్తూరు సంజీవరావును ఎంపిక చేసినట్లు అత్తులూరి శ్రీనివాసరావు వెల్లడించారు.