BREAKING
thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం
Date of Publish : 20 October 2026, 07:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో వైఎస్సార్‌సీపీ సర్వసభ్య సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Oct, 2026 - 07:25 AM
13 వీక్షణలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలి

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేటలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు నెక్కలపు వెంకట కుటుంబరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్, మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకం కావాలని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమష్టి కృషితో ముందుకు సాగాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణుల కార్యాచరణ, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.