BREAKING
thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం thumb ● నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ, సీపీఎం ఆగ్రహం thumb ● డిండి ఆయకట్టు పంటలను కాపాడేందుకు కల్వకుర్తి నీటిని విడుదల చేయాలి thumb ● రూ.2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం thumb ● జర్నలిస్టుల హక్కుల సాధనకు సమష్టిగా పోరాడాలి thumb ● చౌడేపల్లిలో 9 జడ్పీటీసీ నామినేషన్ల ఆమోదం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రం స్థలాన్ని చదును చేసిన వారాహి ఆగ్రో ఇండస్ట్రీస్ thumb ● వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సర్పంచ్ ముందస్తు చర్యలు thumb ● పులివెందులలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మారెడ్డి లతా రెడ్డి ప్రచారం thumb ● బి. శాంతి నామినేషన్‌ తిరస్కరణపై ఆర్డీఓకు సీపీఐ అప్పీల్‌ thumb ● యాదగిరిగుట్టలో శాస్త్రోక్తంగా శ్రీవారి నిత్య కల్యాణం
మంచి మాట
Date of Publish : 25 October 2026, 07:03 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ నేతల దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
25 Oct, 2026 - 07:03 PM
17 వీక్షణలు
  • మార్కాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం
  • ఎన్నికల వ్యూహాలపై చర్చించిన పార్టీ ముఖ్య నాయకులు

మార్కాపురం | ఎన్ టుడే న్యూస్‌:

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మార్కాపురంలో కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. మార్కాపురం పట్టణంలోని జవహర్‌నగర్‌ కాలనీలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అన్నా రాంబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్‌, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

అలాగే, వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ చెప్పలి కనకదుర్గతో పాటు కనిగిరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు కొనసాగించడం వంటి అంశాలపై నాయకులు కార్యకర్తలకు సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.