వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్‌ను కలిసిన జడ్పీటీసీ అభ్యర్థి రాయన ధనలక్ష్మి
- నామినేషన్ ఖరారైన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ధనలక్ష్మి
- కార్యక్రమంలో పాల్గొన్న హనుమంతునిపాడు మండల నాయకులు, కార్యకర్తలు
కనిగిరి | ఎన్ టుడే న్యూస్:
హనుమంతునిపాడు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా తన నామినేషన్ ఖరారైన సందర్భంగా రాయన ధనలక్ష్మి, కుటుంబ సభ్యులు, మండల నాయకులతో కలిసి కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన అభ్యర్థిత్వానికి సంబంధించిన విషయంపై కృతజ్ఞతలు తెలిపారు.
కనిగిరిలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హనుమంతునిపాడు మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యక్కంటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, గొబ్బిలి శ్రీను, యారవ వెంకట్‌రెడ్డి, శ్యామల సాంబశేఖర్‌రెడ్డి, టి. రాజారెడ్డి, మద్ది తిరుపతయ్య, తెల్లగడ్డం వెంకట్రావు, కేతబోయిన వెంకటకాశయ్య, కాటినేని కృష్ణమాచారి, మల్లెల వెలుగొండయ్య, చిట్యాల నాగార్జునరెడ్డి, గరటయ్య, పవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.