నవసిద్ధుల గుట్టలో ప్రతి సోమవారం అన్నసత్రం
భక్తి
భక్తి
ఆర్మూర్ (ఎన్ టుడే న్యూస్): ఆర్మూర్ మండలంలోని నవసిద్ధుల గుట్టకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని ఆలయ కమిటీ సభ్యుడు రవి పంతులు తెలిపారు. పూర్వకాలంలో నవసిద్ధులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు స్థానికుల విశ్వాసమని, అందుకే ఈ ప్రాంతం ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు.
నవసిద్ధుల గుట్టలో ప్రతి సోమవారం అన్నసత్రం నిర్వహిస్తున్నట్లు రవి పంతులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయడం ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వివరించారు.
భక్తులు నవసిద్ధుల గుట్టను సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవడంతో పాటు అన్నసత్ర సేవల్లో పాల్గొనాలని ఆయన కోరారు.