BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 07:16 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

భక్తి భక్తి
24 Nov, 2026 - 07:16 PM
5 వీక్షణలు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

రొంపిచర్ల, నవంబర్ 24, 2026: మండలంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఆలయాలకు భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది.

స్థానిక బాల త్రిపుర సుందరి సమేత శ్రీ శంకరస్వామి ఆలయానికి భక్తులు, మహిళలు వేకువజామున చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.

అదేవిధంగా స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్థానిక పడమటిపాలెంలోని శ్రీ సీతారామ ఆలయంలో ఏకాహం కార్యక్రమం నిర్వహించారు. రొంపిచర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదే విధంగా మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.