BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 08:44 am
Posted by : PEDDABOINA SRIKANTH

కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం

భక్తి భక్తి
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
23 Nov, 2026 - 08:44 AM
24 వీక్షణలు

హిమాలయాల్లో పరమశివుని కోసం తపస్సు ఆచరించిన గురుస్వామి కాలనాగ మహర్షి, శిష్యుడు మహేశ్వర మహర్షి గ్రామానికి రాక

బిక్షాటన చేసినా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం: కాలనాగ మహర్షి

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, ఎన్ టుడే న్యూస్:

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో అత్యంత వైభవంగా శ్రీ పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించాలని ప్రముఖ యోగి గురుస్వామి కాలనాగ మహర్షి సంకల్పించారు. ఈ ఆలయ నిర్మాణం కోసం హిమాలయ పర్వత శ్రేణుల్లో పరమశివుని ధ్యానిస్తూ కఠోర తపస్సు ఆచరించిన గురుస్వామి కాలనాగ మహర్షి, ఆయన శిష్యుడు మహేశ్వర మహర్షి ఆదివారం గ్రామానికి విచ్చేశారు.

లింగసముద్రం ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర

గతంలో ఈ గ్రామం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఇక్కడ శివాలయాన్ని నిర్మించాలనే దివ్య సంకల్పం కలిగినట్లు స్వామీజీ తెలిపారు. గ్రామంలోని జాతీయ రహదారి 563ను ఆనుకుని ఉన్న చెరువు సమీపంలోని లింగసముద్రం ప్రాంతాన్ని ఆలయ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా పరిశీలించారు. ఈ ప్రాంతానికి పురాతన కాలం నుంచి శివలింగాలతో ప్రత్యేక చరిత్ర ఉందని గ్రామస్థుల ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి సంకల్పించడం వెనుక పరమశివుని అనుగ్రహం ఉందని కాలనాగ మహర్షి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోతులనడుమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు.

బిక్షాటన చేసినా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య, ఉపసర్పంచ్ దుండ్ర శ్రీను, గ్రామ నాయకులు, ప్రజలతో స్వామీజీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు.

ఆలయ నిర్మాణం కోసం అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఎంతటి కష్టానికైనా సిద్ధమని, అవసరమైతే బిక్షాటన చేసి అయినా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కాలనాగ మహర్షి స్పష్టం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలు, అన్ని జిల్లాల ప్రజలు కోతులనడుమ గ్రామం పేరును గుర్తుంచుకునే విధంగా ఆలయాన్ని నిర్మించాలన్నది తమ సంకల్పమని తెలిపారు.

గ్రామ ప్రజలు తమకు తోచిన సహాయాన్ని అందించి, ఈ పవిత్ర కార్యానికి ఆశీర్వాదాలు అందిస్తే చాలని స్వామీజీ కోరారు. త్వరలోనే శుభ ముహూర్తం నిర్ణయించి భూమిపూజ కార్యక్రమం నిర్వహిస్తామని, ఆ తేదీని గ్రామస్థులందరికీ ముందుగానే తెలియజేస్తామని చెప్పారు.

గ్రామానికి లభించిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆలయ నిర్మాణంలో గ్రామ ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య, ఉపసర్పంచ్ దుండ్ర శ్రీను, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, గోపగొని తిరుపతి, పల్లెవేన ఎర్రయ్య, మల్లయ్య, రాజు యాదవ్, రవీందర్ యాదవ్, శ్రీపతి బిక్షపతి, మొగిలి, మాట్ల శ్రీనివాస్, రాజయ్య, చిరంజీవి, ఎర్రోళ్ల జగన్, ఎర్రోళ్ల సురేష్, ఎర్రోళ్ల రాజయ్య, ఎర్రోళ్ల రాజబాబు తదితరులతో పాటు గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.