BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 08:27 am
Posted by : MOOLA RAJENDRA REDDY

ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
23 Nov, 2026 - 08:27 AM
26 వీక్షణలు

పదవీ బాధ్యతలు చేపట్టనున్న 32 మంది వార్డు కౌన్సిలర్లు

వైస్ చైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ

ఆళ్లగడ్డ:

ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో నేడు నూతన మున్సిపల్ చైర్మన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మున్సిపాలిటీలోని 32 మంది వార్డు కౌన్సిలర్లు కూడా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

మున్సిపల్ కౌన్సిల్‌లో మొత్తం 32 మంది కౌన్సిలర్లు ఉండగా, వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన 22 మంది, జనసేన పార్టీకి చెందిన ఇద్దరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఉన్నారు. నూతన చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుంది.

ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో వైస్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికపై ఆసక్తి వ్యక్తమవుతోంది.

కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.