BREAKING
thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు?
Test 4
Date of Publish : 22 November 2026, 11:49 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
22 Nov, 2026 - 11:49 PM
9 వీక్షణలు

వృద్ధులు, చిన్నారులకు శ్వాసకోశ సమస్యలు.. శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు విజ్ఞప్తి

ఆళ్లగడ్డ: పట్టణంలోని శోభ కాలనీ సమీపంలో ఉన్న డంప్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు పొగ కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

డంప్ యార్డ్ నుంచి నిరంతరం వెలువడుతున్న పొగతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. పొగ కారణంగా కాలనీలో నివసించడం కష్టంగా మారుతోందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.

ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డంప్ యార్డ్ నుంచి పొగ వెలువడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సమస్యను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి, కాలనీ వాసులకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.