BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 02:45 am
Posted by : K MAHESH

విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
22 Nov, 2026 - 02:45 AM
30 వీక్షణలు

శాస్త్రీయ ఆలోచనా విధానం, పోటీ తత్వాన్ని పెంపొందించడమే లక్ష్యం: జేవీవీ మండల అధ్యక్షుడు మాచర్ల సుందర్ కుమార్

గార్ల :

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించి, సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడంతో పాటు వారిలో పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జేవీవీ గార్ల మండల అధ్యక్షుడు మాచర్ల సుందర్ కుమార్ తెలిపారు.

శనివారం గార్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, ప్రతిభను ప్రదర్శించారు.

వివిధ విభాగాల్లో విజేతల వివరాలు

పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో గార్ల జెడ్పీఎస్‌ఎస్ బాలికల పాఠశాలకు చెందిన మాన్విత, నవ్య నిఖిల, లావణ్య విజేతలుగా నిలిచారు.

ప్రైవేటు పాఠశాలల విభాగంలో నిర్మల పాఠశాలకు చెందిన వీక్షిత, రోహన్, యోక్షిత ప్రతిభ కనబరిచి విజయం సాధించారు.

గురుకుల పాఠశాలల విభాగంలో స్థానిక కేజీబీవీకి చెందిన దివ్య, చిట్టి, నిహారిక విజేతలుగా నిలిచారు.

అనంతరం విజేతలకు నిర్వాహకులు, నాయకులు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం, విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జేవీవీ మండల గౌరవ అధ్యక్షులు ఎం. శివ, వై. అప్పయ్య, మండల కార్యదర్శి వీరన్న, చెకుముకి టాలెంట్ టెస్ట్ కన్వీనర్ బి. రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.