BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 02:40 am
Posted by : K MAHESH

ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
22 Nov, 2026 - 02:40 AM
19 వీక్షణలు

తొలిరోజు కొత్తూరు గ్రామంలో 55 దరఖాస్తుల నమోదు

మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సోమవారం నుంచి నమోదు ప్రక్రియ

ఖానాపూర్, నవంబర్ 21:

ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీలో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. తొలిరోజు కొత్తూరు గ్రామంలో మొత్తం 55 దరఖాస్తులను స్వీకరించారు.

ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమం ప్రకారం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరణను కొనసాగించారు.

అన్ని గ్రామ పంచాయతీల్లో నమోదు కేంద్రాలు

సోమవారం నుంచి ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో దరఖాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శిని క్యాంప్ ఇన్‌ఛార్జిగా నియమించారు. నమోదు ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ పర్యవేక్షణ చేపట్టేందుకు ప్రతి ఐదు గ్రామాలకు ఒకరు చొప్పున నలుగురు సూపర్‌వైజర్లను నియమించారు.

అర్హులైన కుటుంబాల వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా చర్యలు చేపట్టారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, డీటీడీఓ నారాయణ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ హరిబాబు, ఎంపీడీఓ డాక్టర్ వి. అద్వైత, తహసీల్దార్ ఎన్. రమేష్, కొత్తూరు సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.