BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 07:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జిలుగుమాడులో స్వాతంత్య్ర సమరయోధుడు యన్నం వెంకట్రావుకు ఘన నివాళి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 07:23 PM
28 వీక్షణలు

దేశభక్తి, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం యన్నం వెంకట్రావు తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో కుమారుడు కోటేశ్వరరావు మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత రామనాథం

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు యన్నం వెంకట్రావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత రామనాథం హాజరై యన్నం వెంకట్రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యన్నం వెంకట్రావు స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశం కోసం సేవలందించడంతో పాటు, జీవితాంతం నిరాడంబరమైన రైతుగా జీవనం సాగించారని కొనియాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కూడా వ్యవసాయాన్ని నమ్ముకుని, కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించారని తెలిపారు. శ్రమను నమ్ముకుని, నిజాయితీకి ప్రాధాన్యతనిస్తూ సాగించిన ఆయన జీవితం నేటి తరం రైతులకు, యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా కుమారుడు యన్నం కోటేశ్వరరావు కౌన్సిలర్‌గా ప్రజలకు సేవలందిస్తూ మంచి గుర్తింపు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కోటేశ్వరరావు చూపుతున్న చొరవ ప్రశంసనీయమన్నారు. అనంతరం యన్నం వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యన్నం కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు సూర్యదేవర కోటేశ్వరరావు, దోర్నాల వెంకటరవి, కౌన్సిలర్ బెజ్జం రాజు తదితరులు పాల్గొన్నారు.