BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 03:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Nov, 2026 - 03:51 PM
24 వీక్షణలు

హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తెలంగాణలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ భారీ పెట్టుబడి ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో ఏరోస్పేస్, విమాన విడిభాగాల తయారీ రంగాలకు మరింత ఊతం లభించనుంది.

 డిసెంబర్ 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఈ పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశం ఉంది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు పారిస్ సమీపంలోని ఎవ్రీ-కార్బెల్‌లో ఉన్న సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తయారీ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, ఇప్పటికే కొనసాగుతున్న కార్యకలాపాల విస్తరణ, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు.

బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలకు ఇంజిన్లను సరఫరా చేస్తున్న సఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి కీలక పరిణామమని, హైదరాబాద్‌లో సఫ్రాన్ సంస్థ ఇప్పటికే గణనీయమైన స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు వేగంగా అనుమతులు కల్పించే ప్రభుత్వ విధానాలు తెలంగాణకు ప్రధాన బలమని వివరించారు.

సఫ్రాన్ ప్రతినిధులతో జరిగిన సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, డిసెంబర్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు పారిస్ నుంచి సంస్థ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. పర్యటనలో డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, సఫ్రాన్ సంస్థ ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లారెంట్ మజౌ, ఇండస్ట్రియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రొటేటింగ్ పార్ట్స్ డైరెక్టర్ జూలియన్ డి'ఒరాజియో తదితరులు పాల్గొన్నా