BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 07:41 am
Posted by : K MAHESH

మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి

తెలంగాణ
/ నల్గొండ / కనగల్
Reporter
K Mahesh Munugodu Constituency
22 Nov, 2026 - 07:41 AM
39 వీక్షణలు

అనుమానంతో దారుణానికి పాల్పడిన వ్యక్తి.. నల్గొండ జిల్లాలో ఘటన

నల్గొండ జిల్లా, నవంబర్ 21:

నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై అనుమానం పెంచుకున్న వ్యక్తి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం తొరగల గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బొమ్మిశెట్టి రమణ (34)కు నిడమనూరు మండలం సూరేపల్లికి చెందిన హనుమాన్ నాయక్‌తో పరిచయం ఏర్పడింది. గత ఎనిమిదేళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ తొరగల గ్రామంలో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో రమణపై అనుమానం పెంచుకున్న హనుమాన్ నాయక్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమణను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు.