BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 04:58 pm
Posted by : KADARI RAMANA

అగ్రిగోల్డ్ బాధితులకు ధ్రువీకరణ షెడ్యూల్ విడుదల

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
22 Nov, 2026 - 04:58 PM
16 వీక్షణలు

నిర్మల్ జిల్లా బాధితుల కోసం నాస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కేంద్రం.. కేటాయించిన తేదీల్లో హాజరుకావాలని ఎస్పీ సూచన

నిర్మల్ జిల్లా:

అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు ఊరట కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బాధితుల వద్ద ఉన్న బాండ్లు, నగదు రసీదులు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించి వివరాలను నమోదు చేసే ప్రక్రియను సీఐడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ధ్రువీకరణ కేంద్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

నిర్మల్ జిల్లా బాధితుల కోసం మంచిర్యాల జిల్లా పరిధిలోని నాస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు తమ మండలాలకు కేటాయించిన తేదీల్లో కేంద్రానికి హాజరై ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల సూచించారు.

మండలాల వారీగా ధ్రువీకరణ తేదీలు

తేదీమండలంబాధితుల సంఖ్య
ఫిబ్రవరి 27ఖానాపూర్27
మార్చి 1ఖానాపూర్222
మార్చి 1లోకేశ్వరం28
మార్చి 2లోకేశ్వరం217
మార్చి 2ముధోల్33
మార్చి 3ముధోల్212
మార్చి 3నర్సాపూర్ జి38
మార్చి 4నర్సాపూర్ జి207
మార్చి 4నిర్మల్ రూరల్43
మార్చి 5నిర్మల్ రూరల్202
మార్చి 5తానూర్48
మార్చి 8తానూర్198

తీసుకురావాల్సిన పత్రాలు

ధ్రువీకరణ కోసం బాధితులు తమ వద్ద ఉన్న అసలు అగ్రిగోల్డ్ బాండ్ లేదా నగదు రసీదును తప్పనిసరిగా తీసుకురావాలి. వీటితో పాటు బాండ్‌పై సంతకంతో కూడిన కలర్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతులు, బ్యాంకు ఖాతా మొదటి పేజీ జిరాక్స్, తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకురావాలని పోలీసులు సూచించారు.

అలాగే డిపాజిటర్ సభ్యత్వం లేదా డిపాజిట్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్, ఏజెంట్ వివరాలు తెలిసి ఉంటే వాటిని కూడా అందించాలి.

డిపాజిటర్ మరణించిన సందర్భంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులు మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, కుటుంబ సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాటు అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

అసలు బాండ్లు అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదు

అసలు అగ్రిగోల్డ్ బాండ్లను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని, ధ్రువీకరణ కోసం మాత్రమే చూపించాలని పోలీసులు స్పష్టం చేశారు. బాండ్ లేదా నగదు రసీదు కలర్ జిరాక్స్‌పై డిపాజిటర్, నామినీ లేదా చట్టబద్ధ వారసుడు సంతకం చేసి సమర్పించాలి. బ్యాంకు ఖాతాదారుడి పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ స్పష్టంగా కనిపించేలా పత్రాలు సిద్ధం చేసుకోవాలి. సమర్పించిన పత్రాలకు సంబంధించి రసీదు అందజేస్తారు.

ఈ ధ్రువీకరణ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఐఓపీ, సీసీఎస్‌కు చెందిన కృష్ణారెడ్డిని 9885352522 నంబర్‌లో సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు.

బాధితులు తమకు కేటాయించిన తేదీల్లోనే ధ్రువీకరణ కేంద్రానికి చేరుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల సూచించారు. కేంద్రానికి వెళ్లే ముందు తేదీలు, పత్రాల వివరాలను సంబంధిత అధికారుల వద్ద నిర్ధారించుకోవాలని కోరారు.