BREAKING
thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి
Test 4
Date of Publish : 23 November 2026, 06:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కావలిలో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం..

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:00 AM
10 వీక్షణలు

కూటమి అభ్యర్థి భరత్ కుమార్‌ను గెలిపించండి కావలి పట్టణాన్ని కనక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని షాదీ మంజిల్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం మైనారిటీ సోదర, సోదరీమణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ముస్లిం సోదరులు తనపై చూపిన అభిమానంతో అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. హిందువుగా పుట్టిన తనకు ముస్లిం సోదరులతో ప్రత్యేక అనుబంధం ఉందని, గత 20 ఏళ్లుగా జెండా పండుగ ఉత్సవాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. ముస్లింల నమ్మకం, ఆప్యాయత, స్నేహభావం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వారి పక్షాన నిలబడి పోరాడే వ్యక్తిని తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంగళరావు నగర్‌లో షాదీ మంజిల్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ముస్లింలు అడగకుండానే కబరిస్తాన్ అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఎన్నికల్లో తనకు సహకరించని వారికి సైతం ముస్లిం కమిటీల్లో పదవులు కల్పించామని తెలిపారు. మైనారిటీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కావలిలో అత్యధిక స్థానాలను ముస్లింలకు కేటాయించినట్లు వెల్లడించారు. మైసూరు తరహాలో కావలి పట్టణంలో పది ఎకరాల విస్తీర్ణంలో పార్కును అభివృద్ధి చేసేందుకు రూ.8 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు, మంచినీటి కేంద్రాలు, విద్యా సేవలు వంటి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రశంసించారు. రామాయపట్నం పోర్టు పరిధిలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో బీపీసీఎల్ సంస్థ ఏర్పాటు కానుండటం కావలి ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు కానుందని అన్నారు. ఈ సంస్థ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ప్రధానిని ఆహ్వానించనున్నారని తెలిపారు. బీపీసీఎల్ పరిశ్రమతో కావలి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కావలి పట్టణాన్ని కనక పట్టణంగా మార్చడమే తమ అందరి లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే.. వార్డుల విభజన తమ చేతుల్లో లేకపోవడంతో ఆశించిన స్థాయిలో మైనారిటీలకు మరిన్ని అవకాశాలు కల్పించలేకపోయామని తెలిపారు. ఈ ఎన్నికలు తనకు సంబంధించినవి కాకపోయినా, తనను మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అభిమానించే ముస్లిం సోదరులంతా కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భరత్ కుమార్ మంచి వ్యక్తి అని, పట్టణ అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే అవసరమని అన్నారు. గతంలో పదేళ్లపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ముస్లింల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అలాంటి ప్రచారాలను నమ్మి ఓటు వృథా చేసుకోవద్దని సూచించారు. కావలి అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి నాయకత్వంతోనే మరిన్ని పనులు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పేర్కొన్నారు.