BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 23 November 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:04 AM
10 వీక్షణలు

 ఈ ఒక్కసారికి వదిలేద్దాం మరోసారి ఉపేక్షించేది లేదు 

పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. మరోసారి ఉపేక్షించేది లేదు నేతలకు ఏవైనా సమస్యలుంటే ఇన్‌చార్జీకి ఫిర్యాదు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి


హైదరాబాద్: పార్టీకి నష్టం కలిగించేలా కొంతమంది నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే బహిరంగంగా మాట్లాడకుండా పార్టీ ఇన్‌చార్జీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తన వల్లగానీ, మంత్రుల వల్లగానీ నాయకులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పార్టీ ఇన్‌చార్జీకి ఫిర్యాదు చేయాలని, ఆ ఫిర్యాదులపై తమతో తప్పకుండా చర్చిస్తారని తెలిపారు. ఈ ఒక్కసారికి వదిలేద్దాం పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్లాల్సిన మంచి కార్యక్రమాలు, చర్చలు మరుగున పడుతున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఎన్నికల వరకు సందీప్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా కొనసాగుతారని వెల్లడించారు. సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యవహారం చర్చకు రాగా, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు కోరినట్లు తెలిసింది. అయితే ఈ ఒక్కసారికి వదిలేద్దామని సీఎం సూచించారు. మరోసారి పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచి విషయాలను బహిరంగంగా చెప్పాలి మంచి విషయాలను మైకులో చెప్పాలని, చెడు విషయాలను చెవిలో చెప్పాలని రేవంత్‌రెడ్డి నాయకులకు సూచించారు. అధిష్ఠానం ఆదేశాలను వందశాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమం, ప్రజలకు అందిస్తున్న పాలనను దృష్టిలో ఉంచుకుని తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.