BREAKING
thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● చాగలమర్రిలో టీడీపీ నాయకులపై దాడి.. పలువురికి గాయాలు thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి
Test 4
Date of Publish : 23 November 2026, 06:03 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేటలో టీడీపీకి రెబల్ అభ్యర్థి.. సర్పంచ్ స్థానానికి కొమ్ము సుభాషిణి నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:03 AM
19 వీక్షణలు

 పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసిన వారికి గుర్తింపు ఏదీ.. అధిష్ఠానం తీరుపై అసంతృప్తి మంత్రి పార్థసారథి నాయకత్వంలోనూ తమకు న్యాయం జరగలేదంటూ టీడీపీ నేతల ఆవేదన ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి బహిర్గతమైంది. అధికార టీడీపీకి చెందిన రెబల్ అభ్యర్థిగా కొమ్ము లింగయ్య కోడలు కొమ్ము సుభాషిణి ఆదివారం సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు మద్దతుగా టీడీపీ సీనియర్ నాయకుడు చింతా చెన్నారావు నిలిచారు. ఈ సందర్భంగా చింతా చెన్నారావు మాట్లాడుతూ, తొలినాళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని తెలిపారు. 2001 నుంచి 2026 వరకు వివిధ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేశామని వివరించారు. 2001లో కలపాల రమేష్ ఎంపీటీసీగా గెలుపొందేందుకు కృషి చేశామని, 2006లో తాను స్వయంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యానని గుర్తుచేశారు. 2014లో తన సతీమణి విజయకుమారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరం కాలేదన్నారు. ప్రతి ఎన్నికలో పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశామని చెప్పారు. మంత్రి కొలుసు పార్థసారథి నాయకత్వం ప్రారంభమైన తర్వాత చాట్రాయి జడ్పీటీసీ స్థానానికి అవకాశం కల్పించాలని కోరినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామ సర్పంచ్ స్థానానికి అయినా పార్టీ తరఫున అవకాశం కల్పించాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో మానసికంగా బాధకు గురైన తాము, తోటి మిత్రులు, సన్నిహితులు, పార్టీ కార్యకర్తల సూచనలు, మద్దతుతో కొమ్ము సుభాషిణిని రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిపినట్లు తెలిపారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు. తమ విజయంతో తమకు అన్యాయం చేసిన నాయకులకు వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడే నిజమైన కార్యకర్తలు, నాయకులను ఇప్పటికైనా గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఉన్నత విద్యావంతురాలైన మహిళకు అవకాశం ఇవ్వలేదా? చిన్నంపేటలోని హరిజనవాడలో జన్మించిన కొమ్ము సుభాషిణి ఎమ్మెస్సీ, బీఈడీ వరకు ఉన్నత విద్యను అభ్యసించారు. గతంలో గ్రామ వార్డు సభ్యురాలిగా ఎన్నికై గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నామని ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన మహిళలకు తగిన అవకాశాలు కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత విద్యావంతురాలైన మహిళకు సొంత పార్టీలోనే అవకాశం దక్కకపోవడంపై గ్రామంలో చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ చాట్రాయి మండలంతో పాటు నూజివీడు నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో కొమ్ము సుభాషిణి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినప్పటికీ గుర్తింపు లభించడం లేదని భావిస్తున్న అసంతృప్తి నేతలు, కార్యకర్తలకు ఈ పరిణామం ఒక చర్చనీయాంశంగా మారింది. చిన్నంపేట సర్పంచ్ ఎన్నికల్లో ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.