BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 11:44 am
Posted by : BOYA SWAMY

ప్రతి కుటుంబం రూ.5 లక్షల జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
23 Nov, 2026 - 11:44 AM
20 వీక్షణలు

18 నుంచి 59 ఏళ్లలోపు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి

గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం

ఉరుమడ్ల, నవంబర్ 22:

గ్రామంలోని ప్రతి కుటుంబం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం కోరారు. ఈ పథకంలో భాగంగా ఆదివారం గ్రామంలో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ స్వయంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అర్హులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా ప్రజలు చొరవ చూపాలని కోరారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరంగా 15 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఉరుమడ్ల గ్రామంలో నివసిస్తున్న వారితో పాటు, గ్రామానికి చెందినవారు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేలా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించాలని సూచించారు.

పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు లేదా వివరాలు తెలుసుకోవాల్సి ఉంటే గ్రామ పంచాయతీ కార్యదర్శిని లేదా గ్రామ పాలకవర్గ సభ్యులను సంప్రదించాలని సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, వార్డు సభ్యుడు జనపాల శ్రీను, పంచాయతీ కార్యదర్శి ఏలేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.