BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 10:47 am
Posted by : MOOLA RAJENDRA REDDY

ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం!

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
23 Nov, 2026 - 10:47 AM
40 వీక్షణలు

పాత చీరతో ఊయల ఏర్పాటు చేసి జోలపాటతో నిద్రబుచ్చుతున్న తల్లిదండ్రులు

మహానంది:

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఆ కష్టాలు తమ పిల్లలకు రాకూడదని కోరుకుంటారు. తమ స్థితిగతులు ఎలా ఉన్నా బిడ్డకు సంతోషాన్ని, సౌకర్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి తల్లిదండ్రుల ప్రేమకు అద్దం పట్టే హృదయాన్ని హత్తుకునే దృశ్యం నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో కనిపించింది.

ప్లాస్టిక్, ఇనుము వంటి పాత వస్తువులను సేకరించుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ కుటుంబం తమ బిడ్డను ఆటోలోనే జాగ్రత్తగా చూసుకుంటోంది. ఆటోలో ఒక పాత చీరతో చిన్న ఊయల ఏర్పాటు చేసి, అందులో బిడ్డను పడుకోబెట్టి జోలపాట పాడుతూ నిద్రబుచ్చుతున్నారు.

ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా బిడ్డపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత ఈ దృశ్యంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖరీదైన ఊయల లేకపోయినా, అందుబాటులో ఉన్న పాత చీరతోనే బిడ్డకు నిద్రపోయేలా ఏర్పాట్లు చేసుకున్న తల్లిదండ్రుల తీరు పలువురి మనసులను కదిలిస్తోంది.

తాము ఎండనక, వాననక శ్రమిస్తూ జీవనం సాగిస్తున్నా.. తమ బిడ్డకు ప్రేమను పంచడంలో మాత్రం ఎలాంటి లోటు రానివ్వని ఆ తల్లిదండ్రుల దృశ్యం తల్లిదండ్రుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తోంది.