BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 09:02 am
Posted by : PABBINEEDI B SANKAR

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు

తెలంగాణ
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
23 Nov, 2026 - 09:02 AM
20 వీక్షణలు

తెల్లాపూర్ డివిజన్‌లో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన ఎంపీ

వైద్య సిబ్బందితో మాట్లాడి కార్యక్రమ నిర్వహణ, సమస్యలపై ఆరా

తెల్లాపూర్:

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్‌లో నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

అనంతరం కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో ఎంపీ మాట్లాడారు. పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని సూచించారు.

పోలియో వంటి వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రఘునందన్ రావు కోరారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రవీణ్ కుమార్ యాదవ్, బీజేపీ తెల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కొట్టే రవి పాల్గొన్నారు.

అలాగే ఎం. శ్రీనివాస్, నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, కృష్ణ యాదవ్, నవారి మాణిక్ రెడ్డి, రాము, రాజిరెడ్డి, సురేష్, వెంకటరావు, నరేష్, విష్ణు, సుధాకర్ నరసింహ, శంకర్, జోగు రవి తదితరులు పాల్గొన్నారు.