BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 11:31 am
Posted by : DOSAPATI SATISH

కాగిత రామచంద్రపురంలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

భక్తి భక్తి
Reporter
Dosapati Satish Kodada Constituency
13 Nov, 2026 - 11:31 AM
113 వీక్షణలు

నాగదేవతలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు

నడిగూడెం: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం గ్రామంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని వైకుంఠధామం వద్ద వెలసిన నాగదేవతలకు గ్రామ ప్రజలు, భక్తులు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అభిషేకాలు, పూజలు చేశారు.

నాగుల చవితి సందర్భంగా భక్తులు నాగదేవతలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ముడుపులు కట్టారు. తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, కోరుకున్న కోరికలు నెరవేరాలని నాగదేవతలను ప్రార్థించారు. భక్తుల పూజలు, అభిషేకాలతో వైకుంఠధామం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మర్రిపల్లి సైదులు, ఆయన కుటుంబ సభ్యులు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా గ్రామ పెద్దల సహకారంతో నాగదేవతల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చక్రాల ఉమా పిచ్చయ్య, పీఏసీఎస్ చైర్మన్ నాగిరెడ్డి సంధ్యా లింగారెడ్డి, మాజీ సర్పంచ్ నీలకంఠం విమల వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ దోసపాటి రవి, రెండో వార్డు సభ్యురాలు రోండ్ల మణి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ మహిళలు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై నాగదేవతల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.