BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 07:06 pm
Posted by : NUNE SRIKANTH

పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
24 Nov, 2026 - 07:06 PM
6 వీక్షణలు

నవంబర్ 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు

పచ్చల నడుకూడ: గ్రామంలో శ్రీశ్రీశ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ మంగళవారం నుంచి 28వ తేదీ శనివారం వరకు ఐదు రోజుల పాటు మల్లన్న స్వామి పండుగ జరగనుందని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మహోత్సవానికి గ్రామ ప్రజలు, మల్లన్న స్వామి భక్తులందరినీ ఆహ్వానించారు.

మహోత్సవంలో భాగంగా మల్లన్న స్వామి మాలధారణ, విగ్రహ ఊరేగింపుతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నవంబర్ 24, మంగళవారం: మహోత్సవ ప్రారంభ కార్యక్రమంగా మహాగణపతి పూజ, పుణ్యవచనం, స్వస్తి పుణ్యవచనం నిర్వహించనున్నారు.

నవంబర్ 25, బుధవారం: ఉదయం 8.30 గంటలకు మహాగణపతి పూజ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హవనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దేవతా హవనం, మూలమంత్ర హవనం, విగ్రహాలకు జలాధివాసం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమాలు ఉంటాయి.

నవంబర్ 26, గురువారం: ఉదయం కర్మణా పుణ్యవచనం, స్థాపిత దేవతల పూజలు నిర్వహించనున్నారు.

నవంబర్ 27, శుక్రవారం: మహాగణపతి పూజ, హారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు.

నవంబర్ 28, శనివారం: మాల వితరణ, కుంకుమార్చన, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మహోత్సవంలో భాగంగా 25, 26, 27, 28 తేదీల్లో భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ ధర్మకర్తలు, మల్లన్న స్వామి భక్తులు పాల్గొననున్నారు.

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు గ్రామ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు ఆహ్వానిస్తున్నారు.