BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 04:15 pm
Posted by : PAGADALA DEVAIAH

చలో ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ వాల్ పోస్టర్ విడుదల

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
24 Nov, 2026 - 04:15 PM
5 వీక్షణలు

లేబర్ కోడ్స్ రద్దు, రూ.42 వేల కనీస వేతనం, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

ఎల్బీనగర్, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద నిర్వహించనున్న ఆందోళనను జయప్రదం చేయాలని సీఐటీయూ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని రామకృష్ణాపురం లేబర్ అడ్డా వద్ద విడుదల చేశారు. బి. పరుశరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి. చైతన్య, రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు మల్లెపాక వీరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం అమలు చేయాలని, కనీస పెన్షన్ పెంచాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్మిక హక్కుల పరిరక్షణకు ఢిల్లీకి తరలిరావాలి

స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా కార్మికుల వేతనాలు, ఆదాయం, పెన్షన్లలో ఆశించిన స్థాయిలో మార్పు లేదని వారు విమర్శించారు. కార్మికుల శ్రమతో సంపద సృష్టించబడుతున్నప్పటికీ దాని ప్రయోజనాలు యజమానులు, బడా పెట్టుబడిదారులకు ఎక్కువగా దక్కుతున్నాయని ఆరోపించారు. కార్మిక సంక్షేమం కంటే కార్పొరేట్, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే పాలకవర్గాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.

అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు సాగుతున్నాయని వారు ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కార్మికుల ప్రజాస్వామ్య హక్కులపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు.

డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే పార్లమెంట్ మార్చ్‌లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక యూనియన్ సరూర్‌నగర్ సర్కిల్ కార్యదర్శి ఎం.డి. లతీఫ్, కమిటీ సభ్యుడు కే. చంద్రయ్య, రామకృష్ణాపురం కార్యదర్శి ఈ. యేసు, కోశాధికారి ఎం. యాదగిరి, ఆర్గనైజర్లు సీహెచ్. యాదగిరి, బాలస్వామి, యాదగిరి, వెంకన్నతో పాటు లేబర్ అడ్డా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.