BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 06:03 pm
Posted by : K MAHESH

రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
24 Nov, 2026 - 06:03 PM
7 వీక్షణలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి

సంస్థాన్ నారాయణపురం: మండలంలోని చిల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి గుట్ట దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థాన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారంగా రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధి, నిర్వహణకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.

అనంతరం చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పరమశివుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామం సుభిక్షంగా, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.