BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 05:29 pm
Posted by : NUNE SRIKANTH

సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
24 Nov, 2026 - 05:29 PM
8 వీక్షణలు

ఐదు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. ఉత్సవాల్లో పాల్గొంటున్న కుల సభ్యులు, గ్రామ ప్రజలు

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని సూరబీర్యాల్ గ్రామంలో బీమన్న పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, ఊరేగింపు, బీమన్న కల్యాణం, అగ్నిగుండం, సత్యనారాయణ వ్రతం, వనభోజనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ నెల 22వ తేదీన గుట్టపై నుంచి బీమన్న గదలను గ్రామ భవనంలోకి తీసుకువచ్చారు. 23వ తేదీన బీమన్న గదలను గ్రామంలో ఊరేగించి, అనంతరం గంగాస్నానం కోసం తీసుకెళ్లారు.

24వ తేదీన ప్రధాన వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున 4 గంటలకు బీమన్న కల్యాణం నిర్వహించనున్నారు. ఉదయం 5.30 గంటలకు అగ్నిగుండం కార్యక్రమం జరగనుంది. అదే రోజు మోక్షగుండం కార్యక్రమంతో పాటు అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు.

25వ తేదీన సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కుల సభ్యులతో పాటు గ్రామ ప్రజలందరూ పాల్గొంటారు. 26వ తేదీన వనభోజన కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

బీమన్న పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో కుల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని వేడుకలను నిర్వహిస్తున్నారు.