ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులు.. 19న కూడా సెలవు ప్రకటన
దసరా పండుగ నేపథ్యంలో నిర్ణయం.. నవంబర్ 14న అదనపు పని దినం
ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. అక్టోబర్ 18న ఆదివారం, అక్టోబర్ 20న దసరా పండుగ ఉండటంతో మధ్యలో ఉన్న అక్టోబర్ 19న కూడా సెలవు ప్రకటించాలని ఉద్యోగులు కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 19న సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 14న విధులు నిర్వహించాలని సూచించింది.
ఈ నిర్ణయంతో జిల్లాస్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం నుంచి వరుసగా మూడు రోజుల సెలవులు లభించనున్నాయి. మరోవైపు, శాఖాధిపతుల కార్యాలయాలు (హెచ్ఓడీలు), రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి శనివారం నుంచి వరుసగా నాలుగు రోజుల సెలవులు రానున్నాయి.
అయితే, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఈ సెలవుల నిర్ణయం వర్తించదని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సంబంధిత ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు విధులకు హాజరుకావాల్సి ఉంటుంది.