క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల రంగాల్లో భారత్–జపాన్ సహకారం విస్తరణపై చర్చలు
అంతర్జాతీయం
బ్యాంకాక్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (JBIC) గవర్నర్ కజుహికో అమకావాతో సమావేశమయ్యారు. బ్యాంకాక్లో జరుగుతున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో భారత్–జపాన్ మధ్య ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించే అవకాశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించాయి. ఈ రంగాల్లో భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి.