BREAKING
thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● యువతకు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● చౌటుప్పల్‌లో ఈ నెల 29న మెగా జాబ్ మేళా.. నెలకు రూ.19,288 వేతనం thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● యువతకు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● చౌటుప్పల్‌లో ఈ నెల 29న మెగా జాబ్ మేళా.. నెలకు రూ.19,288 వేతనం
Test 4
Date of Publish : 26 November 2026, 07:08 pm
Posted by : K MAHESH

మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 07:08 PM
24 వీక్షణలు

దళారుల దోపిడీని అరికట్టాలి: సీపీఎం మండల కార్యదర్శి, సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

యాదాద్రి జిల్లా: రామన్నపేట: నవంబర్ 26:

మునిపంపుల గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, దళారుల దోపిడీని అరికట్టాలని సీపీఎం మండల కార్యదర్శి, గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం, రైతు సంఘం గ్రామ శాఖల ఆధ్వర్యంలో గ్రామ నాయకులతో కలిసి మునిపంపులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ.. గ్రామంలోని మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వందలాది ధాన్యం రాశులు పోసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా, కేవలం కాంటాలు ప్రారంభించినట్లు చూపిస్తూ కొనుగోళ్లు చేపట్టకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు తక్కువ ధరకు పంటను విక్రయించి తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. సకాలంలో లారీలు రాకపోవడం, మిల్లుల యాజమాన్యాలు తాలు పేరుతో తరుగుడు తీస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. అధికారులు, మిల్లర్లు, దళారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.

అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలు పంపించాలని, కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి తాళ్లపల్లి జితేందర్, రైతు సంఘం గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ మైనొద్దీన్, నోముల నర్సిరెడ్డి, శాఖ నాయకులు జోగుల శ్రీనివాస్, బూడిద బిక్షం, మేడి భాషయ్య, మామిండ్ల నాగార్జున, బూడిద నర్సింహా, తాళ్లపల్లి హరికృష్ణ, తుర్కపల్లి నరేష్, ఎండీ కలిమోద్దీన్, సురేపల్లి స్వామి, చెరుకు మనిహార్, రైతులు సప్పిడి భాస్కర్ రెడ్డి, జయమ్మ, మామిండ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.