BREAKING
thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● అశోకనగర్ కస్తూరిబా పాఠశాలలో అధికారుల ఆకస్మిక తనిఖీ thumb ● లోతుకుంట బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి thumb ● పశువుల తొట్టెల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి: ఎంపీడీవో వి. అద్వైత thumb ● బయ్యారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలకు బయలుదేరిన సర్పంచులు thumb ● నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయండి thumb ● రక్తదానం ప్రాణదానంతో సమానం: జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ thumb ● బొంగగాని భారతి యాదవ్ విజయానికి అజ్జుగుట్టు రవితేజ రెడ్డి ప్రచారం thumb ● మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● విశ్రాంత ఐఏఎస్ బియ్యాల వెంకట పాపారావును కలిసిన మునిగలవీడు సర్పంచ్ చైతన్య నాగరాజు thumb ● అశోకనగర్ కస్తూరిబా పాఠశాలలో అధికారుల ఆకస్మిక తనిఖీ thumb ● లోతుకుంట బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి thumb ● పశువుల తొట్టెల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి: ఎంపీడీవో వి. అద్వైత thumb ● బయ్యారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలకు బయలుదేరిన సర్పంచులు thumb ● నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయండి thumb ● రక్తదానం ప్రాణదానంతో సమానం: జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ thumb ● బొంగగాని భారతి యాదవ్ విజయానికి అజ్జుగుట్టు రవితేజ రెడ్డి ప్రచారం
మంచి మాట
Date of Publish : 29 October 2026, 07:05 pm
Posted by : KOLA MAHESH

రాష్ట్ర ఏక్తా దివస్ వేడుకలకు గుజరాత్ బయలుదేరిన సర్పంచ్లు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
29 Oct, 2026 - 07:05 PM
70 వీక్షణలు

గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో ఉత్తమ పనితీరుకు గుర్తింపు.. యాదాద్రి జిల్లా నుంచి నలుగురు సర్పంచ్‌లకు అవకాశం

 యాదాద్రి :అక్టోబర్ 29:

సంస్థాన్ నారాయణపురం: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా జిల్లా కెవడియాలో అక్టోబర్ 31న నిర్వహించనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలకు హాజరయ్యేందుకు సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి–లింగస్వామి గుజరాత్‌కు బయలుదేరారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కేవలం నలుగురు సర్పంచ్‌లు ఈ వేడుకలకు ఎంపిక కావడం విశేషం. గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదలతో పాటు VB-GRAM పథకం కింద కూలీలకు అధిక పనిదినాలు కల్పించడం వంటి అంశాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు తెలిసింది.

జిల్లా నుంచి ఎంపికైన వారిలో సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి–లింగస్వామి, భువనగిరి మండలం తజ్‌పూర్ సర్పంచ్ ర్యాకల సంతోష–శ్రీనివాస్, తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మాపురం సర్పంచ్ కోమటిరెడ్డి సంతోష–భాస్కర్‌రెడ్డి, తుర్కపల్లి మండలం జేతురామ్ తండా సర్పంచ్ భూక్య సంతోష్ కుమార్ ఉన్నారు.

గ్రామస్థాయిలో ప్రజలకు అందించిన సేవలకు జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎంపిక గ్రామానికి, మండలానికి గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.