తెలుగు తేజాల మెరుపులు.. భారత్‌కు థ్రిల్లింగ్ విక్టరీ!
తిలక్ వర్మ 51, నితీశ్ రెడ్డి 26తో అదరగొట్టారు**
న్యూఢిల్లీ | ఎన్ టుడే న్యూస్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి జట్టును విజయతీరాలకు చేర్చారు.
అజేయ అర్ధసెంచరీతో తిలక్ వర్మ
తిలక్ వర్మ 51 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నితీశ్ రెడ్డి 26 పరుగులతో అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు.
సిరీస్‌లో భారత్‌కు 2-0 ఆధిక్యం
19.5 ఓవర్ల వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. తెలుగు ఆటగాళ్ల ప్రదర్శన భారత అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.