చెరువుగట్టులో ‘వేద ఆశీర్వచనం’ సేవలు ప్రారంభం
ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ప్రారంభోత్సవం
NTODAY NEWS : నార్కెట్ పల్లి
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన నూతనంగా ప్రవేశపెట్టిన 'వేద ఆశీర్వచనం' సేవలతోపాటు నూతనంగా నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ నూతన సౌకర్యాలను, సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, చెరువుగట్టు క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సులభ్ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వేద పండితుల ఆశీర్వచనాలు పొందేందుకు ప్రత్యేక సేవను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలకమండలి చైర్మన్ వారాల రమేష్, కార్యనిర్వహణ అధికారి సల్వాది మోహన్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, వేద పండితులు, ప్రధాన అర్చకులు, దేవస్థాన సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.