BREAKING
thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● యువతకు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● యువతకు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 07:04 pm
Posted by : K MAHESH

మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 07:04 PM
26 వీక్షణలు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా అధికారి అజ్మీర గోపీచంద్ నాయక్

మహబూబాబాద్, నవంబర్ 26:

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అజ్మీర గోపీచంద్ నాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలను అందించిందని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా గుర్తించి నడుచుకోవాలని అన్నారు.

సమాజంలో కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సమానత్వ భావనను పెంపొందించాలని, అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తప్పెట్ల వీరన్న, నిరుడి సామేలు, పిల్లి సుధాకర్, దార్ల శివరాజు, దుడ్డేల రామ్మూర్తి, మంద శశికుమార్, ఇరుగు రవికుమార్, పరడిదల అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.