BREAKING
thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● India: బంగాళాఖాతంలో మరో తుపాను.. ‘మురసు’గా నామకరణం thumb ● Kurnool: 105 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం thumb ● Nalgonda: పట్టభద్రుల ఓటరు నమోదుకు ఆరు రోజులే గడువు thumb ● Ambedkar Konaseema: 17 గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు ఎన్నికల ప్రచారం thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● India: బంగాళాఖాతంలో మరో తుపాను.. ‘మురసు’గా నామకరణం thumb ● Kurnool: 105 ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగం thumb ● Nalgonda: పట్టభద్రుల ఓటరు నమోదుకు ఆరు రోజులే గడువు thumb ● Ambedkar Konaseema: 17 గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు ఎన్నికల ప్రచారం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 09:57 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

Atreyapuram: వైఎస్సార్సీపీ అభ్యర్థి కప్పల శ్రీధర్ ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
01 Nov, 2026 - 09:57 AM
6 వీక్షణలు

ఆత్రేయపురం : (ఎన్ టుడే న్యూస్):

మండల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంకంపాలెం, నార్కెట్‌పల్లి, కట్టుంగపాలెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన అభ్యర్థి

గ్రామాల్లో పర్యటించిన కప్పల శ్రీధర్ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రచారంలో పాల్గొని జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను కోరారు.

ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి

ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు నమ్మకానికి, మోసానికి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు సేవ చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మద్దతు ఉన్న జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్‌తో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

పార్టీ శ్రేణుల భాగస్వామ్యం

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గంగారం చౌదరి, కొరుటూరు శ్రీనివాసరావు, పాల నాగేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.