ఐదుగురు మత్స్యకారులు సురక్షితం.. కొనసాగుతున్న గాలింపు
తెలంగాణ
/
ఖమ్మం
ఐదుగురు మత్స్యకారులు సురక్షితం.. కొనసాగుతున్న గాలింపు
ఖమ్మం: బేతుపల్లి వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులను ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF) సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో నలుగురు సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల వివరాలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.