బూరుగుగూడెంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ 22, 23వ బూత్‌లలో సుమారు 100 ఓట్లు పోలైనట్లు సమాచారం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో 22, 23వ నంబర్ పోలింగ్ బూత్‌లలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల సమయానికి రెండు బూత్‌ల పరిధిలో కలిపి సుమారు 100 ఓట్లు పోలైనట్లు సమాచారం. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమంగా బారులు తీరుతూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ సజావుగా సాగుతోంది.