BREAKING
thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Test 4
Date of Publish : 04 November 2026, 07:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆహార వృధాను అరికట్టడంపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 07:21 PM
16 వీక్షణలు

 బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా విస్సన్నపేట మండల స్థాయిలో అవగాహన ఒక వారం.. ఏడు ఆచరణలు.. ఒక భవిష్యత్తు విస్సన్నపేట, నవంబర్ 4: బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026లో భాగంగా విస్సన్నపేట మండల స్థాయిలో ఆహార వృధాను అరికట్టడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహారాన్ని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు, రైతులకు వివరించారు. ఒకవైపు ఆకలి కేకలు వినిపిస్తుంటే మరోవైపు టన్నుల కొద్దీ ఆహారం చెత్తకుప్పల్లో కలిసిపోతుండటం ఆందోళన కలిగించే విషయమని కార్యక్రమంలో పేర్కొన్నారు. మనిషి కనీస అవసరాలైన ఆహారం, దుస్తులు, నివాసం అందుబాటులో లేని పరిస్థితినే పేదరికంగా పరిగణిస్తామని, అలాంటి పరిస్థితుల్లో ఆహారాన్ని నిర్లక్ష్యంగా వృధా చేయడం సమాజానికి మంచిది కాదని వివరించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) నివేదిక ప్రకారం భారత్‌లో ఏటా సుమారు 7.82 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారం వృధా అవుతోందని, ప్రతి ఇంట్లో సగటున ఏడాదికి 55 కిలోల ఆహారం పడేస్తున్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 93 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. నగరాల్లో సేకరిస్తున్న చెత్తలో సుమారు 44 నుంచి 55 శాతం వరకు ఆహార వ్యర్థాలు, ఆకుకూరలు, కూరగాయల వ్యర్థాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రతి మనిషి తన రోజువారీ పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తి ఆహారం ద్వారానే లభిస్తుందని, అలాంటి ఆహారాన్ని నిర్లక్ష్యంగా పడేయడం వల్ల విలువైన వనరులు వృధా అవుతున్నాయని వివరించారు. ఒకవైపు ఎంతోమంది కనీసం గుప్పెడు మెతుకులు దొరకక ఆకలితో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు తినగలిగిన ఆహారాన్ని పెద్ద మొత్తంలో చెత్తబుట్టల్లో పడేయడం బాధాకరమన్నారు. ఆహార వృధాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, అవసరమైనంత మాత్రమే వండుకోవడం, ప్లేట్లలో మిగిల్చకుండా ఆహారాన్ని తీసుకోవడం, మిగిలిన మంచి ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. వ్యక్తిగత స్థాయి నుంచి కుటుంబం, సమాజం వరకు ఆహార పొదుపును ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడే భవిష్యత్తు తరాలకు ఆహార భద్రత కల్పించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విస్సన్నపేట గ్రామ ఉద్యాన శాఖ సహాయ అధికారి స్పందన, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఐసీఆర్‌పీ బి.వి. నాగలక్ష్మి, టీ ఐసీఆర్‌పీలు జి. భారతి, బి. శాంతి, పి. అంజిబాబు, యూనిట్ ఇన్‌చార్జి జి. శ్రీనివాసరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.